
కృష్ణా నదిలో అమరావతి రైతుల జలదీక్ష
రాయపూడి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధానిప్రాంత రైతులు జలదీక్ష చేపట్టారు. రాయపూడి వద్ద కృష్ణానదిలో రైతులు, మహిళలు మెడ లోతువరకు నీళ్లలో మునిగి నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ పోకడలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ చర్యల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.
శాసనమండలి రద్దు అంశంపైనా రైతులు మాట్లాడారు. రాజకీయ ప్రయోజనం కోసమే అధికార వైకాపా ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసిందని ఆరోపించారు. తాను చేస్తున్నది తప్పని తెలిసినా సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.