జగన్‌ ఆదేశం:ఆ నలుగురి విడుదలకు ప్రయత్నాలు

కువైట్‌ దౌత్యకార్యాలయం పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా మహిళల దీనావస్థపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తమ ఇబ్బందులను తెలియజేస్తూ బాధిత మహిళలు పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ

Updated : 28 Jan 2020 16:14 IST

అమరావతి: కువైట్‌ దౌత్యకార్యాలయం పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా మహిళల దీనావస్థపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తమ ఇబ్బందులను తెలియజేస్తూ బాధిత మహిళలు పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై సీఎం కార్యాలయం స్పందించింది. చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం జగన్‌ ఆదేశించినట్లు వెల్లడించింది. డీజీపీ ఆదేశాలతో ‘దిశ’ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్‌ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు. నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి, వారిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కార్యాలయ స్పందనపై బాధిత మహిళల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని