ఘనంగా శంబర పోలమాంబ ఉత్సవాలు

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి ఉత్సవాలు విజయగరం జిల్లా మక్కువ మండలం శంబరలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం సిరిమానోత్సవం. ఈ కార్యక్రమం..

Published : 28 Jan 2020 16:39 IST

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి ఉత్సవాలు విజయగరం జిల్లా మక్కువ మండలం శంబరలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం సిరిమానోత్సవం. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరగనుంది. సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా శంబరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని