ఖాన్‌సాబ్‌ జర ట్రాఫిక్‌రూల్స్‌ కూడా పాటించు..

పుణే: కుర్రాళ్లు తమ బైక్‌ నెంబర్‌ ప్లేట్లపై రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ మాత్రమే కాకుండా చిత్రవిచిత్రమైన పేర్లు కూడా ప్రింట్‌ చేయించుకుంటారు. మోటర్‌ వెహికల్‌ చట్టం 1988 ప్రకారం ఇటువంటి చర్యలను చట్టం ఉల్లంఘన చేసినట్టుగా పరిగణిస్తారు.

Published : 30 Jan 2020 00:39 IST

పుణే: కుర్రాళ్లు తమ బైక్‌ నెంబర్‌ ప్లేట్లపై రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ మాత్రమే కాకుండా చిత్రవిచిత్రమైన పేర్లు కూడా ప్రింట్‌ చేయించుకుంటారు. మోటర్‌ వెహికల్‌ చట్టం 1988 ప్రకారం ఇటువంటి చర్యలను చట్టం ఉల్లంఘన చేసినట్టుగా పరిగణిస్తారు. కానీ పుణే నగరంలోని ఓ బైకర్‌ నెంబర్‌ ప్లేట్‌పై ‘ఖాన్‌సాబ్‌’ అని దర్జాగా రాయించుకుని శిరాస్త్రాణం ధరించకుండా తిరగుతుండగా ఒక నెటిజన్‌ ఫోటో తీసి అక్కడి ట్రాఫిక్‌పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు ట్వీట్‌ చేశాడు. దీనికి పోలీసులు ఆ బైకర్‌ ఫోటోను ట్యాగ్‌ చేసి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా..‘ మిస్టర్‌ ఖాన్‌సాబ్‌ మీరు చూడటానికి కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించవచ్చు, మీ స్పోర్ట్స్‌ బైక్‌ని నడుపుతూ అందమైన హెయిర్‌స్టయిల్‌తో ఫోజులు కూడా కొట్టొచ్చు..మరి అలాగే ట్రాఫిక్‌ రూల్స్‌ కూడా పాటించాలి కదా..  అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేయడంతో అనేకమంది నెటిజన్లు వాహ్వా..పుణే పోలీస్‌ అంటూ రీట్వీట్‌లు, లైక్‌లు చేస్తున్నారు. ఇప్పటి దాకా ఈ ట్వీట్‌కు 2వేల రీట్వీట్‌లు, 7 వేల లైక్‌లు వచ్చాయి. పుణే పోలీసులు ఇలా హస్యచతురతతో స్పందించటం కొత్తేమి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాగే స్పందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని