ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ఇంధనం!

ఏప్రిల్‌ నెల ఒకటో తేదీ నుంచి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.0.50 నుంచి రూ.1 మేర పెరిగే అవకాశముంది. యూరో-6 ఉద్గార-అల్ట్రా క్లీన్‌-వాహన ఇంధనాలకు భారత్‌ మారుతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో బీఎస్‌-4 ప్రమాణాల ఇంధనం

Updated : 31 Jan 2020 08:13 IST

లీటర్‌కు రూ.0.50 నుంచి రూ.1 మేర ధరలు పెరిగే అవకాశం

దిల్లీ: ఏప్రిల్‌ నెల ఒకటో తేదీ నుంచి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.0.50 నుంచి రూ.1 మేర పెరిగే అవకాశముంది. యూరో-6 ఉద్గార-అల్ట్రా క్లీన్‌-వాహన ఇంధనాలకు భారత్‌ మారుతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో బీఎస్‌-4 ప్రమాణాల ఇంధనం వాడుతున్నాం. ఇది యూరో-4 ప్రమాణాలకు సరిసమానం. మరోవైపు, దేశంలో వాహన కాలుష్యానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్‌-2020 నుంచి నేరుగా (బీఎస్‌-5ను తప్పించేసి) కొత్త ప్రమాణాలను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.73.36, లీటర్‌ డీజిల్‌ రూ.66.36గా ఉంది. బీఎస్‌-6 ప్రమాణాలతో ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రిఫైనరీలను మార్చేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రూ.17,000 కోట్ల పెట్టుబడి పెట్టగా, మొత్తం పరిశ్రమ రూ.30,000 కోట్లు వెచ్చించింది.  తమ కంపెనీకి చెందిన అన్ని రిఫైనరీలు నూతన ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని, ఫిబ్రవరి నెల్లో దేశంలోని అన్ని డిపోలకు ఈ ఇంధనం సరఫరా అవుతుందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఛైర్మన్‌ సంజయ్‌సింగ్‌ తెలిపారు. ‘‘ఏప్రిల్‌-1 గడువుకు మేం కట్టుబడి ఉన్నాం. ఆ రోజు నాటికి మొత్తం పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా కొత్త ప్రమాణాలను చేరుకుంటుంది’’ అని వివరించారు. బీఎస్‌-4 ప్రమాణాల ఇంధనంతో పోల్చితే బీఎస్‌-6 ప్రమాణాల ఇంధనం ధరలు అధికంగా ఉన్నాయని, భారత్‌లోని ధరలు నేరుగా అంతర్జాతీయ ధరలతో ప్రభావితం అవుతున్నందున.. ఏప్రిల్‌ నుంచి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశముందని సంజయ్‌సింగ్‌ తెలిపారు. ఈ పెరుగుదల లీటర్‌కు రూ.0.50 నుంచి రూ.1 మధ్య ఉండే అవకాశముందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని