‘మీనా ఈజ్‌ ద బెస్ట్‌’ అంటున్న గూగుల్‌...

మిగిలిన చాట్‌ బోట్‌లకంటే తమ మీనా మరింత చక్కగా సంభాషించగలదని గూగుల్‌ అంటోంది.

Published : 31 Jan 2020 22:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్చువల్‌ అసిస్టెంట్లు వచ్చిన కొత్తలో అవి మనుషుల్లాగే మాట్లాడేస్తాయని ఆశించాం. అది కొంతవరకు నిజమే కూడా. అమెజాన్‌ అలెక్సా, యాపిల్ సిరి వంటి అసిస్టెంట్లు వాతావరణం, వార్తలు వంటి సాధారణ విషయాలకు సంబంధించి మనం వేసే ప్రశ్నలకు సమాధానం చెబుతాయి. కానీ వాటితో మాట్లాడటం సంభాషణ మాదిరిగా ఉండదు. 

ప్రస్తుతం ఉన్న సిరి, అలెక్సా, కార్టనా వంటి చాట్‌ బోట్‌లకంటే తమ ‘మీనా’ మరింత చక్కగా సంభాషించగలదని గూగుల్‌ అంటోంది. తమ చాట్‌బోట్‌ మీనా ప్రపంచంలో ఏ టాపిక్‌ గురించి అయినా సంభాషించగలదని ఆ సంస్థ చెబుతోంది. 40 బిలియన్‌ పదాలతో మాట్లాడ గల సామర్థ్యం ఉన్న మీనాయే ప్రస్తుతమున్న వాయిస్‌బోట్లలో ఉత్తమమైనది గూగుల్‌ బల్లగుద్ది మరీ చెపుతోంది. మరో విశేషమేంటంటే, సంభాషణా చాతుర్యానికి పరీక్ష అనదగిన  ‘సెన్సిబుల్‌నెస్‌ అండ్‌ స్పెసిఫిసిటీ టెస్ట్‌’లో మనుషులకు 86 మార్కులు వస్తే ప్రాథమిక పరీక్షలో మీనాకు 76 శాతం వచ్చాయి. మరి గూగుల్‌ వాదన ఎంత వరకూ ఒకసారి మీనాతో మాట్లాడి చూస్తే కానీ తెలియదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని