Published : 01 Feb 2020 01:00 IST

గాంధీ ఆసుపత్రికి చేరిన కరోనా కిట్లు

హైదరాబాద్‌: కరోనా నిర్ధారణ పరీక్ష కిట్లు హైదరాబాద్‌ చేరుకున్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అనుమానిత రోగుల రక్త నమూనాలను వైద్యులు పుణెకు పంపించారు. దీంతో రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యశాఖ అన్ని రకాలుగా సమాయత్తమైంది. వైద్యశాఖ అధికారులు నాలుగు ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వం కరోనా కిట్లతో పాటు కొన్ని రక్త నమూనాలను కూడా పంపించింది. కేంద్రం పంపిన నమూనాలతో గాంధీ వైద్యులు ప్రాథమికంగా పరీక్షలు చేయనున్నారు. రిపోర్టులను తిరిగి కేంద్ర వైద్య బృందానికి పంపనున్నారు. పరీక్షలు జరిగిన పద్ధతిని పరీక్షించిన తర్వాతే కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీలో అందుబాటులోకి రానున్నాయి.

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని