రథసప్తమికి తితిదే విస్తృత ఏర్పాట్లు

రథసప్తమికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు. రేపు ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, 9గంటలకు చిన శేషవాహన సేవ, 11 గంటలకు...

Updated : 31 Jan 2020 22:00 IST

తిరుమల: రథసప్తమికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు. రేపు ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, 9గంటలకు చిన శేషవాహన సేవ, 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు హనుమంత వాహనసేవ, 2గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం, 4గంటలకు కల్పవృక్ష వాహనసేవ, 6గంటలకు సర్వభూపాల వాహనసేవ, రాత్రి 8గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తితిదే ఏర్పాట్లు చేసింది.

రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని శ్రీవారి సేవకులను తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సేవకులతో సమావేశమైన ఈవో రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షించారు. వాహన సేవలను దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు తిరువీధుల్లో మంచినీరు, ఆహారం అందించేందుకు సహకరించాల్సిందిగా సేవకులకు సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంకీర్తణ కచేరీ అందరినీ ఆకట్టుకుంది. 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని