అరసవల్లిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణల

Updated : 01 Feb 2020 07:19 IST

అరసవల్లి : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆదిత్యునికి ఘనంగా మహాక్షీరాభిషేక సేవ జరిగింది. ప్రథమార్చన పూజల్లో విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానంద్రేంద్ర సరస్వతీ పాల్గొన్నారు. తొలి పూజలో స్వామి వారిని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణదాస్‌ తదితరులు దర్శించుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని