చిన్నశేషవాహనంపై శ్రీనివాసుడు

తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా తొలుత సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు 9గంటలకు చిన్న శేషవాహనంపై మాడవీధుల్లో విహరించారు.  పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు.

Updated : 01 Feb 2020 10:52 IST

తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా తొలుత సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు 9గంటలకు చిన్న శేషవాహనంపై మాడవీధుల్లో విహరించారు.  పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
వాహన సేవలను వీక్షించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని భక్తులు ..వాహన సేవలను వీక్షిస్తున్నారు.

 

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని