వైకాపా ఎంపీకి ‘అమరావతి’ సెగ

వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌కి అమరావతి నిరసన సెగ తగిలింది. తన సొంతపనిపై కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఆయనను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ...

Updated : 02 Feb 2020 20:04 IST

నందిగామ: వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌కి అమరావతి నిరసన సెగ తగిలింది. తన సొంతపనిపై కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఆయనను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్డుకున్నారు. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలంటూ గులాబీ పూలు ఇచ్చి తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎంపీ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎంపీ సురేశ్ దుర్భాషలాడుతూ బెదిరించారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఆరోపించారు. వైకాపాకు చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతి రైతులకు మద్దతు తెలిపారని.. మిగతా ఎంపీలు కూడా స్పందించాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి మొండిచేయి మిగిలిందని.. అధికార పార్టీకి చెందిన ఎంపీల వల్ల ఏపీకి ఏమీ జరగడం లేదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు విమర్శించారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని