గాంధీలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఇవాళ్టి నుంచి ప్రారంభించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీలో వైరాలజీ ల్యాబ్‌ యూనిట్‌ను

Updated : 03 Feb 2020 16:33 IST

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఇవాళ్టి నుంచి ప్రారంభించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీలో వైరాలజీ ల్యాబ్‌ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కరోనా వైరస్‌ గురించి ఆందోళన చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

గత 10 రోజులుగా కరోనా నిర్ధరణ కోసం నమూనాలను పుణెకు పంపించామని.. అయితే కేంద్రం అనుమతితో ఆ పరీక్షలన్నింటినీ గాంధీ ఆస్పత్రిలోనే ప్రారంభించామని చెప్పారు. వైరస్‌కు నిర్ధరణకు సంబంధించిన కిట్లు, అవసరమైన సిబ్బంది, వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని అన్నారు. కరోనా వైరస్‌ ఇంకుబేషన్‌ పీరియడ్‌ 14 రోజులని ఈటల తెలిపారు. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందించనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలున్న వారందరికీ గాంధీ ఆస్పత్రిలోనే పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వివరించారు. అనంతరం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో నూతన భవనాన్ని ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న 260 పడకలకు అదనంగా మరో 150 పడకలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒకేసారి 9 మందికి డెలివరీ చేసే సదుపాయం ఈ ఆస్పత్రిలో ఉందని చెప్పారు. చాలా ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆస్పత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని