హైదరాబాద్‌కు ‘దిశ’ న్యాయవిచారణ కమిషన్‌

‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన న్యాయవిచారణ కమిషన్‌ ఇవాళ దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది...

Updated : 03 Feb 2020 20:06 IST

హైదరాబాద్‌: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన న్యాయవిచారణ కమిషన్‌ ఇవాళ దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సిర్పూర్‌కర్‌, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. హైకోర్టు ప్రాంగణంలోనే న్యాయ కమిషన్‌ విచారణకు ఏర్పాట్లు చేశారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్‌ విచారణ ప్రారంభించిన ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంది. విచారణలో భాగంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఉన్నతాధికారులతో పాటు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, దర్యాప్తు అధికారులు, ఎన్‌కౌంటర్‌ అనంతరం పంచనామాలో భాగస్వాములైన రెవెన్యూ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను న్యాయ విచారణ కమిషన్‌ ప్రశ్నించనుంది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను కూడా కమిషన్‌ విచారించనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని