లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన అమరావతి రైతులు

అమరావతి రైతులు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిశారు. రైతులతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాజధాని తరలింపు అంశాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం భాజపా ఎంపీ సుజనా చౌదరితోనూ....

Published : 04 Feb 2020 00:48 IST

దిల్లీ: అమరావతి రైతులు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిశారు. రైతులతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాజధాని తరలింపు అంశాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం భాజపా ఎంపీ సుజనా చౌదరితోనూ రైతులు, ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ రాజధాని మార్పు విషయంలో ప్రతికూల కమిటీలే ఉన్నాయని.. సీఎం జగన్‌ సానుకూల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. బాధల నుంచి గట్టెక్కించాలనే అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని ఈ సందర్భంగా రైతులతో సుజనా వ్యాఖ్యానించారు. సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందనే నమ్మకం తనకుందని.. అమరావతి విషయంలో న్యాయ, రాజ్యాంగపరంగా ముందుకెళ్తామని చెప్పారు. అభివృద్ధి పేరుతో కాలయాపన తప్ప జగన్‌ చేసేదేమీ లేదని ఆయన ఆరోపించారు. రేపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో రైతులు, ఐకాస నేతలు భేటీ కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని