త్వరలో అందుబాటులోకి మరో మెట్రోమార్గం

భాగ్యనగర వాసులకు మరో మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 7న సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు.

Updated : 04 Feb 2020 17:06 IST

హైదరాబాద్‌: భాగ్యనగర వాసులకు మరో మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 7న సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మార్గం పొడవు 11 కి.మీ కాగా.. 9 స్టేషన్లు ఉండనున్నాయి. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 45 రోజులపాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. తొలుత సంక్రాంతి నాటికి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ.. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ మార్గం ప్రారంభోత్సవం ఆలస్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని