అంకురార్పణకు వేళాయే.. పోటెత్తిన భక్తులు

భక్తజనుల జయజయధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీద కొలువుదీరనున్న సమయం దగ్గర పడుతోంది. ఈ మహాక్రతువును వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో...

Updated : 05 Feb 2020 19:30 IST

హైదరాబాద్‌: భక్తజనుల జయజయధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీద కొలువుదీరనున్న సమయం దగ్గర పడుతోంది. ఈ మహాక్రతువును వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో మేడారం చేరుకుంటున్నారు. ఈ రోజు రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోనున్నారు. కన్నెపల్లి ఆలయంలో సంప్రదాయ పూజలు చేసిన అనంతరం డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గద్దెల వద్దకు సారలమ్మ చేరుకుంటుంది. ఈ మహాక్రతువును వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి...

మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు

వనం మాయమై.. జనమయమై..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని