గద్దెల వద్దకు చేరుకున్న సమ్మక్క తల్లి

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకుంది. దీంతో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు...

Updated : 06 Feb 2020 21:32 IST

మేడారం: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకుంది. దీంతో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు మేడారం గద్దెలపై కొలువుదీరినట్లు అయింది. తల్లిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అమ్మ గద్దెపైకి చేరే అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించిపోయారు. సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో కాసేపు దర్శనాలు నిలిపివేశారు. పూజారులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్శనాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రేపు, ఎల్లుండి భక్తుల దర్శనార్థం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. ఎల్లుండి సాయంత్రం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని