భూములిచ్చి మేమెక్కడికి పోవాలి

సాగు చేసుకుంటున్న భూములిచ్చేసి మేమెక్కడికి పోవాలో అధికారులే చెప్పాలంటూ విశాఖ జిల్లా పద్మనాభం మండలం, తునివలస పంచాయతీ నరసాపురం గ్రామ రైతులు అధికారులను నిలదీశారు. గ్రామంలోని సర్వే సంఖ్య 74, 91లలో ఉన్న

Updated : 07 Feb 2020 09:50 IST

అధికారులను నిలదీసిన విశాఖ జిల్లా రైతులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: సాగు చేసుకుంటున్న భూములిచ్చేసి మేమెక్కడికి పోవాలో అధికారులే చెప్పాలంటూ విశాఖ జిల్లా పద్మనాభం మండలం, తునివలస పంచాయతీ నరసాపురం గ్రామ రైతులు అధికారులను నిలదీశారు. గ్రామంలోని సర్వే సంఖ్య 74, 91లలో ఉన్న 181.65 ఎకరాల భూమిని సేకరించడానికి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.వి.సూర్యకళ నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం భూసమీకరణ గ్రామసభ నిర్వహించారు. సన్న, చిన్నకారు రైతులంతా ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. భూములను ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. అధికారులు నచ్చజెప్పాలని ప్రయత్నించినా..వినకుండా సభ నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని