వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు.

Updated : 07 Feb 2020 13:08 IST

మేడారం: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వనదేవతల ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రకృతితో మమేకమైందని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. కిలోమీటరు మేర భక్తులు క్యూలో నిల్చొని ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి..

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని