విశాఖ మెట్రోకు కొత్త డీపీఆర్‌

విశాఖ మెట్రో నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం

Updated : 07 Feb 2020 20:48 IST

అమరావతి: విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్‌ ఎండీని ఆదేశించింది. గతంలో డీపీఆర్‌ రూపకల్పనకు ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియంకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త డీపీఆర్‌కు ప్రతిపాదనలు ఆహ్వానించింది. విశాఖలో 79.9 కి.మీ పరిధిలో మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌కు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని