
కోతుల బెడద.. సిబ్బంది వినూత్న ఆలోచన
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది ఓ వినూత్న ఆలోచన చేశారు. రన్‌వేపై కోతుల గుంపులు విమానం ల్యాండింగ్, టేకాఫ్‌లకు తీవ్రంగా ఆటంకం కలిగిస్తున్నాయి. వానరాలు పెట్టే ఇబ్బందులతో విసిగిపోయిన విమానాశ్రయ సిబ్బంది ఎలుగుబంటి వేషంలో కోతులను తరిమి కొడుతున్నారు. పదిహేను రోజులుగా సాయంత్రం సమయంలో ఎలుగుబంటి దుస్తులు ధరించి కోతులను తరుముతున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.