వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి

గద్దెలపై కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. పలువురు ప్రముఖులు, నేతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Updated : 08 Feb 2020 12:21 IST

మేడారం: గద్దెలపై కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. పలువురు ప్రముఖులు, నేతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం ఉదయం  కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా మేడారం జాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారని.. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. త్వరలో గిరిజనల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. గిరిజనుల వద్ద ఆస్తులు లేకపోయినా.. ఆనందం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగ అంశంపై విన్నవించినట్లు చెప్పారు. మరోసారి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 12 లక్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని