జేసీబీ ఢీ.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం

మొహాలి: జేసీబీ ఢీ కొట్టడంతో మూడంతస్తుల భవనం పేకమేడలాగా కుప్పకూలిపోయింది. పంజాబ్‌లోని మొహాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి

Published : 08 Feb 2020 16:57 IST

మొహాలి: జేసీబీ ఢీ కొట్టడంతో మూడంతస్తుల భవనం పేకమేడలాగా కుప్పకూలిపోయింది. పంజాబ్‌లోని మొహాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. విషయం తెలిసుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరిని బయటకు తీశారు. మరో ఏడుగురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మూడంతస్తుల భవనం పక్కన జేసీబీ తవ్వకాలు జరుపుతున్న క్రమంలో పొరపాటుగా భవనం స్తంభాన్ని అది ఢీకొట్టింది. దీంతో భవనం కుప్పకూలిపోయింది.

ఇటీవలే జేసీబీ ఢీ కొట్టడంతో నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఓ ప్రాంతంలో ఆ భవనం పక్కన అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అక్కడ ఉన్న జేసీబీ ఈ నాలుగంతస్తుల భవనం పునాదిని ఢీకొట్టడంతో పెద్ద కుదుపులకు లోనవుతూ పక్కకు ఒరిగిపోయింది. భయంతో అందులో ఉంటున్న వాళ్లంతా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పక్కకు ఒరిగిపోయిన భవనాన్ని కొన్ని రోజుల్లో కూల్చనున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని