ఏపీలో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు, సూపర్ టైమ్ స్కేల్ వేతనాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1995 బ్యాచ్ అధికారులు అతుల్ సింగ్, ఆర్కే మీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు...

Published : 08 Feb 2020 20:41 IST

అమరావతి: రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు, సూపర్ టైమ్ స్కేల్ వేతనాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1995 బ్యాచ్ అధికారులు అతుల్ సింగ్, ఆర్కే మీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సీహెచ్ శ్రీకాంత్, ఏఎస్‌ ఖాన్‌, జె.ప్రభాకర్ రావు, డి.నాగేంద్రకుమార్‌కు ఐజీ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కె.రఘురామ్, కె.రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్.జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయ్ కుమార్, ఎస్.హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్వీ రాజశేఖర బాబు, కేవీ మోహన్‌రావు, పీహెచ్‌డీ రామకృష్ణకు డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని