సమాచార కమిషనర్ల ఎంపికకు కమిటీ భేటీ

రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.  సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌...

Updated : 09 Feb 2020 15:30 IST

హైదరాబాద్: రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీలతో కూడిన కమిటీ ప్రగతి భవన్‌లో ఆదివారం భేటీ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌తో పాటు మరో కమిషనర్‌ విధులు నిర్వహిస్తున్నారు. చట్ట ప్రకారం మరో ఎనిమిది మంది కమిషనర్లను తీసుకునేందుకు అవకాశం ఉన్నందున సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఆశావవహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సమాచార కమిషనర్లను కమిటీ ఎంపిక చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని