Updated : 10/02/2020 20:44 IST

పోలవరం నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ

దిల్లీ: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువును 2021 డిసెంబరు వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో భాజపా ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో గడువు పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు. గతేడాది నవంబర్‌ 26నే ఈ విషయాన్ని లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ నిధుల విడుదలపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్‌ పూర్తయ్యే వరకు నిధులు విడుదల సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈనెలలో విడుదల చేసిన రూ.1850 కోట్లు కలిపి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు రూ.8,614.16 కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి కటారియా వివరించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని