ప్లాస్టిక్‌ తీసుకురండి.. స్నాక్స్‌ పట్టుకెళ్లండి

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లా్స్టిక్‌ ఒకటి. ఆ వ్యర్థాల వల్ల అటు భూమి కలుషితమవ్వడమే కాక.. ఇటు జంతువులు కూడా వాటిని తిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్‌ సమస్యను అధిగమించడంలో రీసైక్లింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, దీనిపై అవగాహన అంతంత మాత్రమే.

Published : 12 Feb 2020 00:35 IST

అహ్మదాబాద్‌‌: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌ ఒకటి. ఆ వ్యర్థాల వల్ల అటు భూమి కలుషితమవ్వడమే కాక.. ఇటు జంతువులు కూడా వాటిని తిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్‌ సమస్యను అధిగమించడంలో రీసైక్లింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీంతో రీసైక్లింగ్‌పై అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గుజరాత్‌లోని దాహోడ్‌ జిల్లా పంచాయత్‌ అధికారులు. చెత్తను సేకరించేందుకు ‘ప్లాస్టిక్‌ కేఫ్‌’ను ప్రారంభించారు. ఇక్కడ స్నాక్స్‌ తినాలంటే ఓ కిలో చెత్త.. టీ తాగాలంటే ఓ అర కిలో చెత్త తీసుకురావాల్సి ఉంటుంది.

రాష్ర్టంలోనే తొలి సారిగా స్వచ్ఛభారత్‌ అభియాన్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా  అధికారులు తెలిపారు. జిల్లా మొత్తాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కిలో ప్లాస్టిక్‌ తీసుకొస్తే స్నాక్స్‌... అరకిలో తీసుకొస్తే.. టీ ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్‌ను అనవసరంగా బయట పడేస్తుండటం గమనించి.. అందుకు పరిష్కారంగా ఈ కెఫేను ప్రారంభించామన్నారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘సఖీ మండల్‌’ పథకం కింద మహిళలు తయారు చేసిన స్నాక్స్‌ను కెఫేలో అందిస్తున్నామని తెలిపారు.  దీనివల్ల మహిళలకూ ఉపాధి లభిస్తోందని చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని