భుజాలపై మోస్తూ.. గర్భిణిని ఆసుపత్రికి

అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం వల్ల పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న నిండు గర్భిణిని భుజాలపై నది దాటించిన ఘటన ఒడిశాలోని కోరాపుట్‌లో ఆదివారం చోటు చేసుకుంది.

Published : 12 Feb 2020 00:34 IST

భువనేశ్వర్‌: అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం వల్ల పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న ఓ నిండు గర్భిణిని భుజాలపై నది దాటించిన వైనమిది. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్‌లో ఆదివారం చోటు చేసుకుంది. దబెన్‌ మధులీ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఘాట్‌గూడ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆమె బంధువులు నదిని దాటి సమీపంలోని దశమంత్‌పూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, ప్రస్తుతం తల్లి బిడ్డల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని