మతం మారినా.. ప్రేమ దక్కలేదు!

ప్రేమ కోసం మతం మారినా.. ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన బొబ్బిలి భాస్కర్‌ అలియాస్‌ అబ్దుల్‌ హునైన్‌ ప్రేమ కోసం చావాడానికైనా సిద్ధం అంటున్నాడు.

Published : 12 Feb 2020 00:34 IST

హైదరాబాద్‌: ప్రేమ కోసం మతం మారినా.. ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన బొబ్బిలి భాస్కర్‌ అలియాస్‌ అబ్దుల్‌ హునైన్‌ ప్రేమ కోసం చావడానికైనా సిద్ధం అంటున్నాడు. కేసు దర్యాప్తు నిమిత్తం ఇవాళ మానవ హక్కుల సంఘం ఎదుట హాజరయ్యాడు. అబ్దుల్ హునైన్‌ ప్రియురాలిని ఆమె తల్లిదండ్రులు కమిషన్‌ ముందు హాజరు పరచనున్నారు. దాదాపు ఏడాది నుంచి ఆయన ప్రియురాలి కోసం పోరాటం చేస్తున్నాడు. వికారాబాద్‌కు చెందిన బొబ్బిలి భాస్కర్‌ ప్రియురాలి షరతు ప్రకారం మతం మార్చుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో గత నెలలో హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని