వివేకా హత్యకేసుపై హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును...

Updated : 13 Feb 2020 17:14 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాల్సిన ఆవశ్యకతపై తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. అడ్వొకేట్‌ జనరల్‌ అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 20కి వాయిదా వేశారు.

వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌తో పాటు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా వివేకా కుమార్తె సునీత కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసు వ్యవహారంలో గతంలో వేసిన పిటిషన్‌ను జగన్‌ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని