ఇకపై తమిళనాడు బస్సుల్లో సీసీ టీవీ కెమెరాలు

బస్సుల్లో ప్రయాణించే మహిళలను, యువతులను ఇబ్బంది పెట్టే ఆకతాయిల ఆటలు ఇక తమిళనాడులో సాగవు

Updated : 14 Feb 2020 23:43 IST

చెన్నై: బస్సుల్లో ప్రయాణించే మహిళలను, యువతులను ఇబ్బంది పెట్టే ఆకతాయిల ఆటలు ఇక తమిళనాడులో సాగవు. ఇకపై రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేయనున్నట్టు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో 2020-21 బడ్జెట్‌ను ఆయన ఈ రోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... బస్సుల్లో మహిళల భద్రతను పెంపొందించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందుకు రూ.75.02కోట్లను నిర్భయ నిధి నుంచి కేటాయిస్తామని కూడా ఆయన వివరించారు. కాగా  2020-21 బడ్జెట్‌లో రవాణా శాఖకు రూ.2,716.26కోట్లను కేటాయించారు. అంతేకాకుండా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు తమిళనాడు రవాణా శాఖలో ఎలక్ట్రానిక్‌ టికెటింగ్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని