వీరి ప్రేమ ఎందరికో ఆదర్శం...

ఎన్నో భిన్నమైన ప్రేమకథలు విని ఉంటాం. ఎన్నో ఆసక్తికరమైర ప్రణయ ప్రయాణాలను చదివుంటాం. కానీ, ప్రమంటే ఏంటో చెప్పమంటే ఆలోచనల్లో పడతాం. విశ్వమంత ప్రేమను నిర్వచించడం నిజంగా ఓ సవాలే.............

Published : 15 Feb 2020 14:30 IST

జడగావ్‌(ఒడిశా): ఎన్నో భిన్నమైన ప్రేమకథలు విని ఉంటాం. ఎన్నో ఆసక్తికరమైర ప్రణయ ప్రయాణాలను చదివుంటాం. కానీ, ప్రేమంటే ఏంటో చెప్పమంటే ఆలోచనల్లో పడతాం. విశ్వమంత ప్రేమను నిర్వచించడం నిజంగా ఓ సవాలే.. కానీ ఒడిశాకు చెందిన జగన్నాథ్‌, ప్రతీక్షలను చూస్తే మాత్రం ప్రేమంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. జాజ్‌పూర్‌ జిల్లా జడగావ్‌ గ్రామానికి చెందిన జగన్నాథ సేథీకి పుట్టుక నుంచే రెండు చేతులు లేవు. దీంతో కాళ్లతోనే తన పనులను ఎలా చేసుకోవాలో అలవాటు చేసుకున్నాడు. పొట్టకూటి కోసం మేకలు కాసే జగన్నాథ్‌ జీవితంలోకి నాలుగేళ్ల క్రితం ప్రతీక్ష సాహు అనే అమ్మాయి వచ్చింది. పక్క గ్రామానికి చెందిన ఆమె మేకలు కాస్తూ జగన్నాథ్‌కు పరిచయమైంది. మాటలతో పాటు మనసులూ కలిశాయి. వీరిద్దరి కులాలు వేరుకావడంతో ప్రతీక్ష తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు. దీంతో వారిని ఎదిరించి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. చేతులు లేని భర్తకు ఇప్పుడు చేయూతనిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. పేద, ధనిక, అందం, వైకల్యం ఇవేమీ పట్టించుకోని వారి ప్రేమ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. నిజమైన ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో మరోసారి నిరూపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని