ఈ డైపర్‌ తడిస్తే తెలిసిపోతుంది!

బుజ్జాయికి వేసిన డైపర్‌ బాగా తడిసిపోయిందేమోనని పదే పదే తడిమి చూడాల్సిన అవసరం లేకుండా అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలచ్కీజీజి (ఎంఐటీ) పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ...

Published : 16 Feb 2020 23:30 IST

వాషింగ్టన్‌: బుజ్జాయికి వేసిన డైపర్‌ బాగా తడిసిపోయిందేమోనని పదే పదే తడిమి చూడాల్సిన అవసరం లేకుండా అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలచ్కీజీజి (ఎంఐటీ) పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేపట్టారు. పరిమితికి మించి తడిగా మారిన వెంటనే అప్రమత్తం చేయగల స్మార్ట్‌ డైపర్‌ను అభివృద్ధి చేశారు. తడిని శోషించుకునేందుకుగాను డైపర్‌లో ఉండే హైడ్రోజెల్‌ దిగువన పరిశోధకులు ప్రత్యేక సెన్సర్‌ను ఏర్పాటుచేశారు. దానిలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగ్‌ ఉంటుంది. డైపర్‌ పరిమితికి మించి తడి మారితే ఆర్‌ఎఫ్‌ఐడీ రేడియో సంకేతాలను విడుదల చేస్తుంది. ఒక మీటరు దూరంలోని సంకేత గ్రాహకాన్ని అవి చేరగలవు. వెంటనే అక్కడి నుంచి తల్లిదండ్రులు, సంరక్షకుల స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లకు సందేశం వస్తుంది. తక్కువ వ్యయంలోనే స్మార్ట్‌ డైపర్లను ఉత్పత్తి చేయొచ్చునని పరిశోధకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని