క్యాప్సికంలో బెకబెక...

రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తున్న ఓ కెనడా జంటకు నిర్ఘాంతపోయే సంఘటన ఎదురయింది.

Published : 19 Feb 2020 14:36 IST

క్యుబెక్‌: రాత్రి భోజనానికి వంట సిద్ధం చేస్తున్న ఓ కెనడా మహిళకు నిర్ఘాంతపోయే సంఘటన ఎదురైంది. నికోలే గాగ్నన్‌, జెరార్డ్‌ బ్లాక్‌బర్న్‌ దంపతులు కెనడాలోని క్యుబెక్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 9న నికోలె కూరగాయలు కోస్తున్నారు. వాటిలోని క్యాప్సికంలో ఓ చిన్ని కప్ప కనిపించింది. అదీ బతికి ఉన్నది కావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెట్లపై ఉండే ఆకుపచ్చని కప్ప అందులోకి ఎలావచ్చిందో ఆ దంపతులకు అంతుచిక్కలేదు. దీంతో వారు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా సోషల్‌ మీడియాలో ఈ సంఘటన విపరీతంగా వైరల్‌ అవుతోంది. కూరగాయలు కోస్తున్నప్పుడు తమకు ఎదురైన విచిత్ర అనుభవాలను నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని