వీసీల నియామకానికి ఆదేశాలు జారీ

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీసీల నియామకానికి...

Published : 19 Feb 2020 15:48 IST

హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీసీల నియామకానికి ముందు సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. వీసీల నియామకానికి ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమమం అవుతుందన్నారు. రెండు నుంచి మూడు వారాల్లోగా మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని