బీర్‌ కోసం..పాతికవేలు

ఒక వృద్ధుడు ఆన్‌లైన్‌లో బీర్‌ డోర్‌డెలవరీ ఆర్డర్‌ పెట్టబోయి పాతికవేలకు మోసపోయాడు. ముంబయిలోని లోఖాండ్‌వాలా టౌన్‌షిప్‌లో నివాసం ఉండే 64

Published : 20 Feb 2020 01:24 IST

 

ముంబయి: ఒక వృద్ధుడు ఆన్‌లైన్‌లో బీర్‌ డోర్‌డెలివరీ ఆర్డర్‌ పెట్టబోయి పాతికవేలకు మోసపోయాడు. ముంబయిలోని లోఖాండ్‌వాలా టౌన్‌షిప్‌లో నివాసం ఉండే 64 ఏళ్ల ఒక రిటైర్డ్ ఇంజనీర్‌ ఫిబ్రవరి 15వ తేది రాత్రి సమయంలో బీర్‌ ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ఇచ్చే ఉద్దేశంతో అంతర్జాలంలో వెతికాడు. సెర్చ్‌ఇంజిన్‌ నుంచి అతనికి చరవాణికి సందేశం ద్వారా నాలుగు హెల్ప్‌లైన్‌ నెంబర్లు వచ్చాయి. అవి లోకల్‌ వైన్‌ షాపుల నెంబర్లుగా భావించిన వృద్ధుడు వాటిలో ఒకదానికి కాల్‌ చేయగా రూ. 350 అడ్వాన్స్‌గా చెల్లించాలన్నారు. అతడు సరే అనటంతో సైబర్‌నేరగాడు అతని చరవాణికి క్యూఆర్‌ కోడ్ పంపించాడు. సైబర్‌నేరగాడి సూచనలతో ఆ క్యూఆర్‌కోడ్‌ ద్వారా నగదు చెల్లింపు చేయగా వెంటనే రూ.12,345 నగదు సదరు వ్యక్తి ఖాతా నుంచి డెబిట్ అయినట్టుగా సందేశం వచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. పొరపాటు జరిగిందని, డబ్బులు వెనక్కి పంపిస్తానంటూ మరో క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. అందులో నుంచి కూడా మరోసారి రూ.12,345 డెబిట్ అవడంతో బాధితుడు లబోదిబో అనకుంటూ లోకల్‌వైన్‌ షాపు వద్దకు వెళ్లి అడుగగా అది తమ చరవాణి నెంబరు కాదని, అసలు డోర్‌డెలివరీ సర్వీస్‌ లేదంటూ సమాధానం ఇచ్చారు. దీంతో  బాధితుడు స్థానిక సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని