సైనిక కుటుంబాలకు రూ.కోటి అందజేసిన పవన్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం దిల్లీ చేరుకున్న ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు.  మిలటరీ డే సందర్భంగా సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి గతంలో విరాళంగా ప్రకటించిన

Updated : 20 Feb 2020 16:40 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం దిల్లీ చేరుకున్న ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు.  మిలటరీ డే సందర్భంగా సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి గతంలో విరాళంగా ప్రకటించిన రూ.కోటి చెక్కును ¸కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్‌ మృగేందకుమార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడుతూ...సైనిక కుటుంబాల సంక్షేమం కోసం తనవంతు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. సైనిక కుటుంబాలకు సహాయం చేయాలని బ్రిగేడియర్‌ మృగేందకుమార్‌ రాసిన లేఖ తన మనసును తాకిందన్నారు. అందుకే కోటి రూపాయలు విరాళంగా అందజేసినట్లు చెప్పారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు .. సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని కోరారు. మధ్యాహ్నం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌ సదస్సులో పవన్‌ పాల్గొననున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు