భయపడితే విజయం సాధించలేరు: శైలజాకిరణ్‌

వృత్తిలో విలువలు ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆమె ప్రసంగించారు.

Updated : 20 Feb 2020 16:42 IST

హైదరాబాద్: వృత్తిలో విలువలు ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆమె ప్రసంగించారు. వ్యాపారం అభివృద్ధి చెందిందా లేదా అని కాకుండా వ్యాపారం ద్వారా సమాజానికి ఎంత మంచి జరిగిందో అందరూ ఆలోచించాలని సూచించారు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత తక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని.. అది మన వ్యక్తిత్వాన్ని వివరించేలా ఉండాలన్నారు. విజయాల్లో భాగస్వాములకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు.

పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని శైలజా కిరణ్‌ సూచించారు. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ తప్పులను రెండో సారి చేయకూడదని చెప్పారు. వ్యాపారులు ఏం చేయగలరో అదే చెప్పాలని.. అదే చేయాలని సూచించారు. వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు. వ్యాపారులు దృఢమైన, అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని.. అలాంటి సమయాల్లో భయపడేవారు ఎప్పటికీ విజయం సాధించలేరన్నారు. రేపటి గురించి భయపడకుండా ప్రస్తుతాన్ని ఆస్వాదించాలని ఆమె సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని