తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే పరమశివుని నామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో నీలకంఠుడి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడల్లో భక్తులు అర్ధరాత్రి నుంచి

Updated : 21 Feb 2020 12:03 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే పరమశివుని నామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో నీలకంఠుడి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడల్లో భక్తులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీశైలంలోని స్వయంభువుగా వెలసిన మల్లికార్జునస్వామి- భ్రమరాంబికాదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో ఈ రోజు సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం జరగనుంది. రాత్రి 12 గంటలకు భ్రమరాంబికాదేవి-మల్లికార్జునస్వామి వార్ల బ్రహోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్‌, కోటిలింగాల ఘాట్‌లకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు.

 దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శివరాత్రి నేపథ్యంలో అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనం కల్పిస్తున్నారు. తితిదే తరఫున రాజరాజేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శివదీక్ష పరులకు అధికారులు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.30 గంటలకు గర్భగుడిలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.


 Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని