‘శంభో శివ శంభో’.. ఈటీవీ ప్రత్యేక కార్యక్రమం

మాఘ బహుళ చతుర్ధశి రోజు శివుడు లింగ రూపంలో అవతరరించిన దినం మహా శివరాత్రి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, ఐదు కేదారేశ్వర ఆలయాలతో పాటు....

Updated : 21 Feb 2020 22:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాఘ బహుళ చతుర్ధశి రోజు శివుడు లింగ రూపంలో అవతరించిన దినం మహా శివరాత్రి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, ఐదు కేదారేశ్వర ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ శివరాత్రిని పురస్కరించుకుని ‘శంభో శివ శంభో’ పేరిట ‘ఈటీవీ’ సంగీత నృత్య కార్యక్రమం నిర్వహించింది. గీతా మాధురి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. యువ గాయకులు కారుణ్య, రమ్య బెహరా, శ్రావణ భార్గవి, కృష్ణ చైతన్య, మంగ్లీ తదితరులు భక్తిగీతాలు పాడారు. ‘మహా దేవ శంభో’, ‘సదా శివ సన్యాసి’ ‘ఎట్టాగయ్యా శివ శివా నీవన్నీ వింత ఆటలే’ అంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకూ వచ్చిన భక్తి గీతాలు ఆలపించారు. మహా శివుడికి సంబంధించిన గేయాలకు తమదైన నృత్యాలతో నృత్యకారులు అలరించారు. సుమారు 2 గంటల పాటు సాగే ఈ కార్యక్రమం మీకోసం.. (వీడియో)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని