Updated : 22/02/2020 11:32 IST

అందరం కలిసి పనిచేయాలి: జస్టిస్‌ ఎన్వీ రమణ

దిల్లీ: సమస్యల పరిష్కారానికి కొత్త ఆలోచనలు వస్తున్నాయి.. అందరం కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. దిల్లీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వివిధ దేశాల ప్రతినిధులను సదస్సు ఒకే వేదికపైకి తెచ్చిందని, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. కొత్త ఆలోచనలతో న్యాయవ్యవస్థ ముందుకు రావాలని ఆకాంక్షించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రదానమైనవి ఉగ్రవాదం, సైబర్‌ క్రైమ్‌. సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ కీలకమైంది. మనది వసుదైక కుటుంబం, మహిళలు అనేక రంగాల్లో ముందున్నారు’’ అని వివరించారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డేతో పాటు 24 దేశాలకు చెందిన న్యాయ నిపుణులు సదస్సుకు హాజరయ్యారు.

 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని