నిర్భయ దోషులకు చివరిచూపు అవకాశం

నిర్భయ కేసు దోషులు తమ కుటుంబాలను చివరి చూపు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు తెలిపారు. కేసులో దోషులుగా ఉన్న ముకేశ్‌సింగ్‌, వినయ్‌శర్మ, పవన్‌, అక్షయ్‌ను మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరి తీయనున్నారు.

Updated : 22 Feb 2020 17:14 IST

దిల్లీ: నిర్భయ కేసు దోషులు తమ కుటుంబాలను చివరి చూపు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తిహాడ్‌ జైలు అధికారులు తెలిపారు. కేసులో దోషులుగా ఉన్న ముకేశ్‌సింగ్‌, వినయ్‌శర్మ, పవన్‌, అక్షయ్‌లను మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరి తీయనున్నారు. ఉరిశిక్ష అమలుకు రెండు రోజుల ముందుగానే తలారిని పంపించాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌ జైలు అధికారులకు సైతం లేఖ రాశారు. కాగా.. ఫిబ్రవరి 1కి ముందే ముకేష్‌సింగ్‌, పవన్‌ చివరి చూపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అక్షయ్‌, వినయ్‌ కూడా తమ కుటుంబాలను చూస్తామని కోరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దోషుల్లో ఒకరైన వినయ్‌ ఫిబ్రవరి 16న జైలులోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే, దోషులకు ఉరిశిక్ష విధిస్తూ డెత్‌వారెంట్‌ జారీ చేయడం ఇది మూడోసారి. జనవరి 22న ఉరి తీయనున్నట్లు జనవరి 17న కోర్టు తొలుత తీర్పు వెలువరించింది. ఆ తర్వాత శిక్షను ఫిబ్రవరి 1కు వాయిదా వేసింది. మరోసారి ఫిబ్రవరి 17న విచారణ అనంతరం మార్చి 3న శిక్షను అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఉరి శిక్ష అమలులో ఆలస్యం చోటుచేసుకోవడం నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు