ఏడు గంటలు చిరుత, కుక్కపిల్ల ఒకేచోట..!

బావిలో పడ్డ కుక్కపిల్ల, చిరుతను అటవీ అధికారులు కాపాడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. నందూర్బార్‌ జిల్లా ధంపే గ్రామంలో ఓ కుక్కపిల్లను వేటాడే క్రమంలో చిరుత దాంతో..........

Published : 23 Feb 2020 15:57 IST

ముంబయి: బావిలో పడ్డ కుక్కపిల్ల, చిరుతను అటవీ అధికారులు కాపాడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. నందూర్బార్‌ జిల్లా ధంపే గ్రామంలో ఓ కుక్కపిల్లను వేటాడే క్రమంలో చిరుత దాంతో సహా బావిలో పడిపోయింది. దాదాపు ఏడు గంటల పాటు ఆ రెండు బావిలోనే ఉండిపోయాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు నాలుగు గంటల పాటు శ్రమించి వాటిని బయటకు తీశారు. బావిలో ఉన్న సమయంలో కుక్కపిల్లను చిరుత ఏమీ చేయకపోవడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని