రైతులను తాకుతూ వెళ్లిన వైకాపా ఎంపీ వాహనం

వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ వాహనం రోడ్డు పక్కన నిలుచున్న రాజధాని రైతులను తాకుతూ వెళ్లింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా

Published : 24 Feb 2020 00:43 IST

అమరావతి: వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ వాహనం రోడ్డు పక్కన నిలుచున్న రాజధాని రైతులను తాకుతూ వెళ్లింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా రైతులు అమరావతి ఆలయానికి వెళ్లారు. అనంతరం రోడ్డు పక్కన రైతులు నిలుచుని ఉన్న సమయంలో అటుగా వచ్చిన ఎంపీ నందిగం సురేశ్ వాహనం రైతులను తగులుకుంటూ వెళ్లింది. వాహనం తాకుతూ వెళ్లడంతో తుళ్లూరుకు చెందిన రైతు తాడికొండ హనుమంతరావు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో అతని కుడికాలు చిటికిన వేలికి గాయమైంది. సహచర రైతులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ సురేశ్ కారులోనే ఉండటం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని