ఆ ఫోన్‌ నాకు గ్రాహంబెల్‌ ఇచ్చారు..!

ప్రముఖ వ్యాపారవేత్త, యాపిల్‌ కంపెనీ భాగస్వామి వారెన్‌ బఫెట్‌ సోమవారం ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన ఇప్పటివరకూ స్మార్ట్‌ఫోన్‌ వాడలేదట.. శాంసంగ్‌ కంపెనీకి చెందిన కీప్యాడ్‌ ఫోనే ఉపయోగించారట.

Published : 26 Feb 2020 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త, యాపిల్‌ కంపెనీ భాగస్వామి వారెన్‌ బఫెట్‌ సోమవారం ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన ఇప్పటివరకూ స్మార్ట్‌ఫోన్‌ వాడలేదట.. శాంసంగ్‌ కంపెనీకి చెందిన కీప్యాడ్‌ ఫోనే ఉపయోగించారట. ఇటీవల ఆ ఫ్లిప్‌ ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారానని ఆయన సోమవారం ఓ సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం ఐఫోన్‌కు మారాను. స్మార్ట్‌ఫోన్‌కు అయితే మారాను.. కానీ నాకు అది సాధారణ ఫోన్‌లా కాల్‌, మెసేజ్‌ల కోసమే ఉపయోగిస్తున్నా’ అని వెల్లడించారు. అలా అని బఫెట్‌ ఐఫోన్‌ గ్యాడ్జెట్‌ ఉపయోగించడం ఇదే మొదటిసారి ఏం కాదు... ఆయన తరచూ స్టాక్‌ మార్కెట్లను చూసుకోవడం కోసం ఐపాడ్‌ వినియోగిస్తున్నట్లు గతంలో చెప్పారు. 

గతంలో కొంత మంది తనకు ఐఫోన్లు ఇచ్చినప్పటికీ ఆయన వాటిని వినియోగించలేదని చెప్పారు. తన మొదటి ట్వీట్‌ను కూడా 2013లో ఐపాడ్‌ నుంచే చేసినట్లు చెప్పారు. గతంలో ఒకసారి తన పాత ఫోన్‌ అయిన శాంసంగ్‌ ఎస్‌సీహెచ్‌-యూ320ను మీడియాకు చూపిస్తూ.. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ స్వయంగా తనకు ఇచ్చినట్లుగా చమత్కరించారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని