బుడతడి డ్యాన్స్‌.. మెలనియా నవ్వులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ఓ చిన్నారి నృత్యానికి ఫిదా అయ్యారు. భారత పర్యటనలో భాగంగా రెండో రోజు ఆమె దిల్లీలోని సర్వోదయ కోఎడ్యుకేషనల్‌ సీనియర్‌ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హ్యాపీనెస్‌ క్లాసెస్‌లో

Published : 26 Feb 2020 01:31 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలనియా ఓ చిన్నారి నృత్యానికి ఫిదా అయ్యారు. భారత పర్యటనలో భాగంగా రెండో రోజు ఆమె దిల్లీలోని సర్వోదయ కోఎడ్యుకేషనల్‌ సీనియర్‌ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హ్యాపీనెస్‌ క్లాస్‌లో ఆమె పాల్గొని చిన్నారులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో వేదికపై తమ సీనియర్‌ విద్యార్థినులు గ్రూప్‌ డ్యాన్స్‌ చేస్తుండగా ఓ బాలుడు పైకిలేచి ఉత్సాహంతో అమెరికా జెండా పట్టుకొని డ్యాన్స్‌ చేసి నవ్వులు పూయించాడు. అప్పటి వరకూ వేదికపై ఉన్న విద్యార్థుల ప్రదర్శనను చూస్తున్న మెలనియా సైతం ఒక్కసారిగా వెనక్కి తిరిగి డ్యాన్స్‌ చేస్తున్న ఆ బుడతడిని చూసి చప్పట్లు కొడుతూ మురిసిపోయారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని