కాలితో తన్నిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తండ్రిని కాలితో తన్నిన ఘటనపై కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంమంత్రి మహమూద్‌ అలీ సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఓ ఇంటర్‌ విద్యార్థిని కళాశాల క్యాంపస్‌లో

Published : 28 Feb 2020 00:33 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తండ్రిని కాలితో తన్నిన ఘటనపై కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంమంత్రి మహమూద్‌ అలీ సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఓ ఇంటర్‌ విద్యార్థిని కళాశాల క్యాంపస్‌లో ఆత్మహత్యకు పాల్పడగా ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘ నాయకులు బుధవారం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థి మృతదేహం వద్ద ఆమె తండ్రి విలపిస్తుండగా కానిస్టేబుల్‌ శ్రీధర్‌ బూటు కాలితో తన్నారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ సైతం కానిస్టేబుల్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని ట్విటర్‌ ద్వారా కోరారు. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పోలీసులు వారికి అండగా నిలవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసినట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత హోం మంత్రి ఆదేశాలతో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి..
అసలే పుట్టెడు దుఃఖం..ఆపై కాలితో తన్నారు!
 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు