
Updated : 28 Feb 2020 14:53 IST
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఇవాళ మత్స్య అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారు విహరించారు. వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Tags :