దిల్లీ మెట్రోలో వివాదాస్పద నినాదాలు

 దిల్లీలోనే అతి పెద్దదైన రాజీవ్‌చౌక్‌ మెట్రో స్టేషన్‌లో  ఉదయం 10.25గంటల ప్రాంతంలో రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరుతున్న క్రమంలో వివాదాస్పద నినాదాలు వినిపించాయి.

Updated : 29 Feb 2020 18:17 IST

దిల్లీ: . దిల్లీ రాజీవ్‌చౌక్‌ మెట్రో స్టేషన్‌లో ‘దేశద్రోహులను కాల్చేయండి’ అంటూ కొంతమంది యువకులు నినాదాలు చేశారు. శనివారం ఉదయం 10.25గంటల ప్రాంతంలో రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఈ నినాదాలు వినిపించాయి. ‘దేశ యువత సీఏఏకు మద్దతు ఇవ్వడంతో పాటు దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా వారు నినాదాలు చేశారు. కొంతమంది ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ కనిపించారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌(సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) అధికారులు ఆ నినాదాలు చేసిన ఆరుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను దిల్లీ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఇటీవల ఈశాన్య దిల్లీలో జిహాదీ టెర్రరిజానికి వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద శాంతి ర్యాలీ నిర్వహించారు. భాజపా నేత కపిల్‌శర్మ కూడా ఇలాంటి నినాదాలే చేశారు. కోర్టు సైతం ఆయన వ్యాఖ్యలపై  తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. గత వారం రోజుల్లోనే మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అలజడి ఏర్పడింది.

 

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని