‘నిర్భయ’ నిందితుల మరో పిటిషన్‌

నిర్భయ నిందితులు తమ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దిల్లీ కోర్టులో శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 3న నిందితులు.........

Published : 29 Feb 2020 21:48 IST

దిల్లీ: నిర్భయ నిందితులు తమ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దిల్లీ కోర్టులో శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 3న నిందితులు నలుగురికీ ఉరిశిక్షను అమలు చేయాలంటూ ఇప్పటికే కోర్టు డెత్‌వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్షయ్‌సింగ్‌, పవన్‌కుమార్‌ గుప్తా వేసిన పిటిషన్లపై మార్చి2లోగా సమాధానం ఇవ్వాలని అదనపు సెషన్‌ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా తిహాడ్‌ జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు.

నిందితుల్లో ఒకరైన అక్షయ్‌సింగ్‌ తరఫున న్యాయవాది ఏపీ సింగ్‌ ద్వారా అన్ని విషయాలను వివరిస్తూ తాజాగా రాష్ట్రపతిని ‘క్షమాభిక్ష’కు అభ్యర్థించినట్టు పేర్కొన్నాడు. అది పెండింగ్‌లో ఉన్నందున స్టే విధించాలని కోరాడు. అలాగే మరో నిందితుడైన పవన్‌ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉన్నందున ఉరిశిక్ష అమలుపై  స్టే విధించాలని కోరాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం మార్చి 3న మరణశిక్ష అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని